Engineering student: రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులతో.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం కొండెంగలగుట్ట తండాకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకున్నాడు.

Updated : 11 Jul 2023 08:46 IST

నెల్లికుదురు, న్యూస్‌టుడే: రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం కొండెంగలగుట్ట తండాకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకున్నాడు. నెల్లికుదురు ఎస్సై క్రాంతికిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొండెంగలగుట్ట తండాకు చెందిన బానోతు అచ్చాలి, కస్సా దంపతుల కుమారుడు ఆకాశ్‌(22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కొద్దినెలల కిందట రుణ యాప్‌ ద్వారా రూ.30 వేలు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో యాప్‌ నిర్వాహకుల వేధింపులు పెరిగాయి. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. పొదుపు సంఘం నుంచి రుణం మంజూరు కాగానే ఇచ్చేద్దామని నచ్చజెప్పారు. యాప్‌ నిర్వాహకుల ఒత్తిడి అధికం కావడంతో ఆకాశ్‌ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ఇంటికి చేరుకున్నాడు. రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని