Crime news: ప్రభుత్వ ధనం దుర్వినియోగంపై ఫేక్‌ నోట్‌.. కేసు నమోదు

తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్‌నోట్‌ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది. 

Published : 09 Jun 2024 15:38 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్‌నోట్‌ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది. టీఎస్‌ నుంచి టీజీగా పేరు మార్పునకు రూ.2,767 కోట్లు ఖర్చవుతాయని సైబర్‌ నేరగాళ్లు ఓ ఫేక్‌నోట్‌ను రూపొందించారు. దీనిపై విచారణ చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. దాన్ని సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో ఫేక్‌నోట్‌ ప్రచారం కావడంపై ప్రభుత్వం సీరియస్‌ కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని