Fake Notes: ₹41లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం

రూ.41లక్షలకు పైగా విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీజ్‌ చేశారు.

Published : 03 Sep 2023 16:43 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని సోనేపూర్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అతడి నుంచి రూ.41.16లక్షల విలువ చేసే నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.  ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందం సీజ్‌ చేసిన ₹500 కరెన్సీ నోట్లన్నీ నిజమైన నోటుకు ఉండాల్సిన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉన్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తిని దీపక్‌ మెహర్‌గా గుర్తించారు.

నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నకిలీ కరెన్సీ నోట్లను పరీక్షించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ నోట్‌ ముద్రన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు పంపారు. అయితే, ఈ నకిలీ నోట్లు ఛత్తీస్‌గడ్‌ నుంచి తరలిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరిని పట్టుకొనేందుకు చర్యలు చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని