Sangareddy: బొంతపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 

Updated : 25 May 2024 21:22 IST

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తుక్కు గోదాములో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. తుక్కు సామగ్రి గోదాములో రసాయన డ్రమ్ములు ఉండటంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలికి సమీపంలో రసాయన పరిశ్రమలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు