Hyderabad: మహేశ్వరంలోని తుక్కుగూడలో భారీ అగ్నిప్రమాదం

మహేశ్వరంలోని తుక్కుగూడలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హార్డ్‌వేర్‌ పార్క్‌లోని కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

Updated : 25 May 2024 00:20 IST

హైదరాబాద్‌: మహేశ్వరంలోని తుక్కుగూడలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హార్డ్‌వేర్‌ పార్క్‌లోని ఓ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కంపెనీలోని ఒకటో నంబర్‌ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో కంపెనీ సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సెక్యూరిటీ గార్డులు సిబ్బంది మొత్తాన్ని బయటికి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపుచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు