Fire Accident: పెబ్బేరులో అగ్నిప్రమాదం.. 12.88 లక్షల గన్నీ సంచులు దగ్ధం!

వనపర్తి జిల్లా పెబ్బేరులోని మార్కెట్‌ యార్డు గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది.

Updated : 01 Apr 2024 20:39 IST

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరులోని మార్కెట్‌ యార్డు గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదంలో 12.88 లక్షల గన్నీ సంచులు దగ్ధమైనట్లు సమాచారం. పక్కనే ఉన్న ధాన్యం బస్తాలకు సైతం మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 3 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మార్కెట్‌ అధికారులు సంఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని