Fire Accident: సంగారెడ్డి జిల్లాలోని హెటిరో ల్యాబ్స్‌లో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 

Published : 27 May 2024 17:27 IST

జిన్నారం: సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ల్యాబ్‌లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 4 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని