Fire accident: షార్ట్‌ సర్క్యూట్‌తో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా ఉలవపాడు సమీపంలో చోటుచేసుకుంది. శనివారం వేకువజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన మేరకు.

Published : 09 Jun 2024 05:04 IST

ప్రయాణికులు సురక్షితం

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఉలవపాడు, న్యూస్‌టుడే: షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా ఉలవపాడు సమీపంలో చోటుచేసుకుంది. శనివారం వేకువజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన మేరకు.. శ్రీ తులసి ట్రావెల్స్‌కు చెందిన బస్సు 33 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి హైదరాబాద్‌ బయలుదేరింది. చాగొల్లు వద్దకు రాగానే బస్సు నుంచి పొగ వస్తున్నట్లు డ్రైవర్‌ గమనించి రోడ్డు పక్కన నిలిపివేశారు. అంతలోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో వెనక ద్వారం నుంచి ప్రయాణికులను సురక్షితంగా దింపేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని