Chennai: చెన్నై విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 26 May 2023 23:18 IST

బెంగళూరు: చెన్నై విమానాశ్రయంలో (Chennai Airport) కస్టమ్స్‌ అధికారులు భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని (Foreign Currency) స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి లగేజీని పరీక్షించగా 2,83,500 అమెరికా డాలర్లు, 5,00,000 సౌదీ రియల్స్‌ ఉన్నట్లు గుర్తించి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో దాని విలువ దాదాపు రూ.3.37 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసిన కస్టమ్స్‌ అధికారులు అతడిని రిమాండ్‌కు తరలించారు. అంతపెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ ఆయనకు ఎలా చేరిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఇతడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని