Crime: గుడిసెల్లోకి దూసుకెళ్లిన బస్సు..నలుగురు కూలీల మృతి

గుడిసెల్లో నిద్రిస్తున్న కూలీల పైకి ప్రైవేటు బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన గోవాలో చోటుచేసుకుంది.

Published : 26 May 2024 11:22 IST

గోవా: రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన శనివారం అర్థరాత్రి దక్షిణ గోవాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్ (Verna Industrial Estate) వద్ద వలస కూలీలు వారి గుడిసెల్లో నిద్రిస్తుండగా అర్థరాత్రి 11.30గంటల సమయంలో ఓ బస్సు గుడిసెల పైకి దూసుకొచ్చింది. దీంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గయపడిన మరో ఐదుగురిని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 

ఘటన జరిగిన సమయంలో తనకు ఫోన్‌ రావడంతో గుడిసెలో నుంచి బయటకు వచ్చానని తాను చూస్తుండగానే బస్సు వేగంగా వచ్చి రెండు గుడిసెల్లోకి దూసుకెళ్లిందని రూపేందర్ మాథుర్ అనే కూలీ తెలిపారు.  డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమన్నారు. ఘటనలో తన సోదరుడు, మామ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు  చేస్తే చంపేస్తానని డ్రైవర్‌ బెదిరించినట్లుగా వాపోయాడు. బాధితులకు చికిత్స చేయడంలో వైద్య సిబ్బంది జాప్యం చేయడంతో క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని