ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Published : 27 Feb 2024 13:20 IST

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.

డీఆర్‌జీ పెట్రోలింగ్‌ బృందం చిన్న తుంగలీ అడవీ ప్రాంతంలో గాలిస్తుండగా.. మావోయిస్టులు తారసపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని