Hyderabad: రూ.26 కోట్ల నగదు బదిలీ.. ఇద్దరు సైబర్‌ కేటుగాళ్లు అరెస్ట్‌

పెట్టుబడుల పేరుతో  మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం డీసీపీ కవిత తెలిపారు.

Published : 13 Apr 2024 15:15 IST

హైదరాబాద్‌: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సైబర్‌ క్రైం డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితులు నౌషద్‌, కబీర్‌ కేరళలో ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్టు చెప్పారు. కేసు వివరాలను శనివారం ఆమె మీడియాకు వెల్లడించారు. పార్ట్‌ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా బాధితులకు నిందితులు పరిచయమయ్యారు.

‘‘లింక్‌ షేర్‌ చేసి.. దానిని క్లిక్‌ చేయడం ద్వారా బాధితులను టెలిగ్రామ్‌లో యాడ్‌ చేస్తారు. లైక్‌ చేయడం, లింక్స్‌ క్లిక్‌ చేయడం, అంతర్జాతీయ కంపెనీల రివ్యూలు రాయడం లాంటి టాస్క్‌లు ఇస్తారు. పార్ట్‌ టైం ఉద్యోగం కావడంతో బాధితులు అందులో చేరారు. జాబ్‌లో చేరిన తర్వాత కొంత నగదు వస్తుంది. పెట్టుబడులు పెట్టించి మరికొంత నగదు తిరిగి ఇస్తారు. వారి మాటలు నమ్మి బాధితులు రూ.9 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టారు. నిందితులు తిరిగి చెల్లింపులు చేయకుండా అకౌంట్‌ బ్లాక్‌ చేశారు. ఖాతా స్తంభించి పోయింది కాబట్టి.. నగదు రిలీజ్‌ అవ్వాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని చెబుతారు. వేర్వేరు అకౌంట్లలోకి డబ్బులు జమ చేయిస్తారు. ఇలాంటి 18 బ్యాంకు ఖాతాలను గుర్తించాం. ఇందులో రూ.26 కోట్ల అక్రమ నగదు బదిలీ చేశారని గుర్తించాం’’ అని డీసీపీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని