ఉద్యోగం కోసం దారుణం.. 3 నెలల చిన్నారిని నదిలో పడేసిన తల్లిదండ్రులు

రాజస్థాన్‌లోని బీకానేర్‌లో దారుణం జరిగింది. మూడు నెలల చిన్నారిని తల్లిదండ్రులే కాలువలో పడేశారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి ఘటనాస్థలికి చేరుకునేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

Updated : 25 Jan 2023 08:14 IST

రాజస్థాన్‌లోని బీకానేర్‌లో దారుణం జరిగింది. మూడు నెలల చిన్నారిని తల్లిదండ్రులే కాలువలో పడేశారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి ఘటనాస్థలికి చేరుకునేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని బయటకు తీశారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. నిందితులైన ఝన్వర్‌లాల్‌, గీతా దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా పలు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ‘‘ఝన్వర్‌లాల్‌.. చందాసర్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు కాంట్రాక్ట్‌ ఉద్యోగి. తనకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని అఫిడవిట్‌ సమర్పించాడు. మూడో బిడ్డ ఉందని తెలిస్తే ఉద్యోగం పోతుందని భయపడ్డాడు. ఈ కారణంగా దంపతులిద్దరూ 3 నెలల ఆడబిడ్డను కాలువలో పడేసి చంపేశారు’’ అని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని