వైకాపా నేత వేధింపులతో మహిళ ఆత్మహత్య

వైకాపా నేతల వేధింపులతో కోటకొండ కన్నెమ్మ (65) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.

Published : 25 Jan 2023 04:43 IST

కుటుంబసభ్యుల ఆరోపణ.. మృతదేహంతో నిరసన

ఈనాడు, తిరుపతి: వైకాపా నేతల వేధింపులతో కోటకొండ కన్నెమ్మ (65) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. వైకాపా నేత అసభ్య పదజాలంతో దూషించడమే ఆమె మరణానికి కారణమని శవపరీక్ష చేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా భీష్మించుకు కూర్చున్నారు. చివరికి స్థానిక తహసీల్దారు వెంకటేశ్వర్లు హామీతో శవపరీక్షకు అంగీకరించారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ పరిధిలోని బీరమాకుల కండ్రిగలో కన్నెమ్మ ఇంటికి ఆనుకుని గ్రామకంఠం భూమి ఉంది. భూమిని ఆనుకుని వైకాపా నేత మునికృష్ణారెడ్డికి పొలం ఉంది. గ్రామకంఠం పొలంలో మునికృష్ణారెడ్డి కంచె వేయడంతో పాటు, మట్టిని తరలించి ఎత్తు పెంచినట్లు ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీనివల్ల గతంలోనూ పలు సందర్భాల్లో వైకాపా నేతతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో కన్నెమ్మ ఇంటిద్వారం వద్ద ఇనుప స్తంభాలు పెట్టారని, దీనిపై కన్నెమ్మ ప్రశ్నించడంతో ఆమెను దుర్భాషలాడినట్లు చెబుతున్నారు. మనస్తాపానికి గురై సోమవారం రాత్రి కన్మెమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని