రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం

పాపను ఆడించేందుకు వచ్చాడనుకున్న యువకుడు అఘాయిత్యానికి తెగబడ్డాడు. అభం శుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Published : 26 Jan 2023 04:45 IST

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం

గార్ల, న్యూస్‌టుడే: పాపను ఆడించేందుకు వచ్చాడనుకున్న యువకుడు అఘాయిత్యానికి తెగబడ్డాడు. అభం శుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని ఓ తండాలో బుధవారం జరిగింది. రోజూ మాదిరి వ్యవసాయ పనులకు వెళ్లిన పాప తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు చిన్నారి బాధ్యతలను బామ్మకు అప్పగించారు. బామ్మ ఆరుబయట పనులు చేస్తుండగా పాప ఇంట్లో ఆడుకుంటోంది. అదే తండాకు చెందిన అశోక్‌ (32) ఇంట్లోకి వెళ్లాడు. పాపను ఆడించేందుకు వచ్చాడని బామ్మ భావించగా.. ఆ యువకుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భయంతో చిన్నారి ఏడుస్తుండడంతో ఇంటి పక్కనే ఉన్న వారంతావచ్చారు. వారిని చూసిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని విద్యుత్తు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాపను వైద్య పరీక్షల నిమిత్తం మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ యువకుడు గతంలో నాలుగేళ్ల పాపపై అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో గ్రామస్థులు పట్టుకొని మందలించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, ఈ సంఘటన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు