ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

ముగ్గురు మావోయిస్టులు గురువారం ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు.

Published : 27 Jan 2023 04:29 IST

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: ముగ్గురు మావోయిస్టులు గురువారం ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. ఎస్పీ నితీష్‌ వాద్వానీ, డీఐజీ అమితాబ్‌ ఠాకుర్‌ విలేకరులకు వివరాలను వెల్లడించారు. మల్కాన్‌గిరి జిల్లా మథిలి ఠాణా పరిధిలోని కర్తనపల్లి పంచాయతీ దల్‌దలి గ్రామానికి చెందిన మనోజ్‌, పండు కవాసి, ఐతే కర్తామిలు మావోయిస్టు కమిటీలో సభ్యులుగా ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మరోవైపు మల్కాన్‌గిరి జిల్లా మథిలి ఠాణా తులసి కొండ ప్రాంతంలో మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పిస్తోలు, 50 తూటాలు, 15 టిఫిన్‌ బాక్సు బాంబులు, రైఫిల్‌, మూడు దేశీ తుపాకులు, 14 డిటోనేటర్లు, 10 జిలెటిన్‌ స్టిక్‌లు, గ్యాస్‌ సిలిండర్‌, సెల్‌ఫోన్లు, దుస్తులు, ఔషధాలు ఇతర సామగ్రి అందులో ఉన్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని