నాసా పేరుతో మోసం.. రూ.6 కోట్లు స్వాహా

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా పేరుతో కొందరు దుండగులు.. 100 మందికి టోకరా వేసి రూ.ఆరు కోట్లు దోచుకున్నారు.

Updated : 03 Feb 2023 06:46 IST

ముంబయి: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా పేరుతో కొందరు దుండగులు.. 100 మందికి టోకరా వేసి రూ.ఆరు కోట్లు దోచుకున్నారు. మహారాష్ట్రలోని కొంతమంది వ్యక్తులు నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ పేరుతో రైస్‌పుల్లర్‌ యంత్రంపై పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయని బాధితులకు తెలిపారు. నాసా శాస్త్రవేత్తలు ఈ యంత్రంపై పరిశోధనలు చేస్తున్నారంటూ.. ప్రస్తుతం ఈ లోహ కుండకు మంచి డిమాండ్‌ ఉందని వారితో నిందితులు చెప్పారు. దీంతోపాటు కొన్ని నకిలీ పత్రాలను చూపించారు. వారు చెప్పింది నిజమేనని భావించిన బాధితులు వారికి నగదును ముట్టజెప్పారు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సాన్‌వానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని