పీకలదాకా మద్యం తాగి నాగుపాముతో ఆటలు.. కాటు వేయడంతో మృతి

పీకలదాకా మద్యం తాగిన ఓ యువకుడు మత్తులో నాగుపామును ముద్దాడాడు. దాన్ని మెడలో వేసుకుని విన్యాసాలు చేసాడు. పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.

Updated : 06 Mar 2023 09:45 IST

పీకలదాకా మద్యం తాగిన ఓ యువకుడు మత్తులో నాగుపామును ముద్దాడాడు. దాన్ని మెడలో వేసుకుని విన్యాసాలు చేసాడు. పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాదా జిల్లాలోని గోవింద్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దిలీప్‌ యాదవ్‌ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు పూటుగా మద్యం తాగి.. పామును ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత సర్పాన్ని మెడలో వేసుకుని ఆలయం ముందు శిరస్సు వంచి దండాలు పెట్టాడు. తనను క్షమించమని దేవుడిని కోరాడు. ఆ తర్వాత మెడలో పాముతో కాసేపు చిందులేశాడు. కాసేపటికి తర్వాత పాము కాటువేయడంతో కిందపడిపోయాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని