Gold smuggling: డైపర్‌లో బంగారం అక్రమ రవాణా

బంగారాన్ని తరలించేందుకు అక్రమార్కులు ప్రతిసారీ కొత్త ఎత్తులు వేస్తున్నారు. మంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఒక ప్రయాణికుడు తన 22 నెలల కుమార్తె డైపర్‌లో బంగారాన్ని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు.

Updated : 19 Mar 2023 08:37 IST

మంగళూరు, న్యూస్‌టుడే: బంగారాన్ని తరలించేందుకు అక్రమార్కులు ప్రతిసారీ కొత్త ఎత్తులు వేస్తున్నారు. మంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఒక ప్రయాణికుడు తన 22 నెలల కుమార్తె డైపర్‌లో బంగారాన్ని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి ప్యాకెట్లలో నింపి డైపర్‌లో పెట్టినట్లు గుర్తించారు. అంతకుముందు మరో ప్రయాణికుడు బంగారాన్ని రేకులా తయారు చేసి బెల్టు వెనుక భాగంలో పెట్టుకొని తరలించేందుకు ప్రయత్నిస్తూ చిక్కాడు. మరో వ్యక్తి తన రహస్య భాగాల్లో బంగారాన్ని ఉంచి తీసుకెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 15వ తేదీల మధ్యలో మంగళూరు విమానాశ్రయంలో రూ.90.67 లక్షల విలువైన 1606 గ్రాముల బంగారాన్ని జప్తు చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని