వివాహ వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ యువకుడి మృతి

వివాహ వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి కుమారుడు సత్యసాయిరెడ్డి(21) చెన్నైలో ఉంటూ శ్రీపెరంబుదూర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు.

Published : 28 Mar 2023 05:14 IST

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: వివాహ వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి కుమారుడు సత్యసాయిరెడ్డి(21) చెన్నైలో ఉంటూ శ్రీపెరంబుదూర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. అతడి స్నేహితురాలి సోదరి వివాహం ఆదివారం చెన్నైలోని కోయంబేడులో జరిగింది. వేడుకలో పాల్గొన్న సత్యసాయిరెడ్డి.. స్నేహితులతో కలిసి డ్యాన్స్‌ చేస్తుండగా అకస్మాత్తుగా కిందపడి స్పృహకోల్పోయాడు. ఫిట్స్‌ వచ్చి చెవిలోంచి రక్తం కారడంతో స్నేహితులు వెంటనే తిరుమంగళం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని