ఆరుగురిని బలిగొన్న మస్కిటో కాయిల్
దేశ రాజధాని నగరంలో దారుణం జరిగింది. దోమల నివారణకు పెట్టుకొన్న మస్కిటో కాయిల్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు.
మృతుల్లో మూడేళ్ల చిన్నారి
దిల్లీ: దేశ రాజధాని నగరంలో దారుణం జరిగింది. దోమల నివారణకు పెట్టుకొన్న మస్కిటో కాయిల్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. మరో అయిదుగురికి కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం ఈశాన్య దిల్లీ శాస్త్రి పార్క్ సమీపంలోని ఇంట్లో జరిగినట్లు డీసీపీ జాయ్ టిర్కీ తెలిపారు. ఇంటి కింది భాగంలో నివసిస్తున్న అక్బర్ అలి సోదరులు పై భాగాన్ని బిహార్ రిక్షా కార్మికులకు ఇటీవలే అద్దెకు ఇచ్చారు. అన్నదమ్ముల కుటుంబాలు తెల్లవారుజామున రంజాన్ సెహరీ ముగించి పడుకున్నాక పై అంతస్తులో ప్రమాదం జరిగి పొగ, మంటలు వ్యాపించాయి. నిద్రపోతున్న సమయంలో.. కిందపడిన మస్కిటో కాయిల్ పరుపునకు అంటుకొని మంటలు చెలరేగాయి. కమ్ముకొన్న పొగతో స్పృహ కోల్పోయి ఊపిరాడక నలుగురు పురుషులు, ఓ మహిళ మృతిచెందారు. దట్టమైన పొగ విస్తరించడంతో కిందిభాగంలో ఉంటున్న అక్బర్ అలి సోదరుడి సంతానమైన హంజా (3) కూడా ఊపిరాడక మృతిచెందింది. ఈ ఇంట్లోని రెండు అంతస్తుల్లో మొత్తం 20 - 25 మంది ఉంటున్నారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!