అమృతలూరు పోలీస్‌స్టేషన్‌లో వాలంటీర్‌ హల్‌చల్‌

బాపట్ల జిల్లా  అమృతలూరు పోలీసుస్టేషన్‌లో శనివారం వైకాపా సానుభూతిపరులు హల్‌చల్‌ చేశారు. అందులో ఒక వాలంటీరు ఉన్నాడు.

Published : 02 Apr 2023 04:09 IST

బైకు అపహరణ కేసులో తన సోదరుడిని తీసుకొచ్చారని ఆగ్రహం

అమృతలూరు, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా  అమృతలూరు పోలీసుస్టేషన్‌లో శనివారం వైకాపా సానుభూతిపరులు హల్‌చల్‌ చేశారు. అందులో ఒక వాలంటీరు ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాంచాళవరం గ్రామానికి చెందిన తురుమెళ్ల స్లారా అనే వ్యక్తి పాతకేసులో నిందితుడు. చెరుకుపల్లి మండలంలో ఇటీవల ద్విచక్ర వాహనం అపహరణకు గురైంది. ఈ వాహనం స్లారా వద్ద ఉండడం చూసిన వాహనదారులు పోలీస్‌స్టేషన్‌కు బైకుతో సహా నిందితుడిని పట్టుకొచ్చారు. ఈ విషయం తెలిసి నిందితుడి అన్న, గ్రామ వాలంటీరు తురుమెళ్ల వెంకట్‌ స్టేషన్‌కు వచ్చి తన తమ్ముడిని ఎందుకు తీసుకొచ్చారని పోలీసులతో గొడవకు దిగాడు. సోదరులిద్దరూ పోలీసులను అసభ్యపదజాలంతో దూషించారు. ఈ గొడవ నేపథ్యంలో స్టేషన్‌ గది అద్దాలు రెండుచోట్ల పగిలిపోయాయి. వాలంటీరు వెంకట్‌, అతని తమ్ముడు స్లారాపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్‌ చెప్పారు. పోలీసులను భయపెట్టేందుకు స్లారా అద్దాలను తలతో కొట్టుకున్నాడని తెలిపారు. నిందితులు ఇద్దరూ వైకాపాలో క్రియాశీలకంగా తిరుగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు