You tuber: 300 కి.మీ. స్పీడ్‌తో బైక్‌ నడుపుతూ.. యూట్యూబర్‌ దుర్మరణం

ప్రొఫెషనల్‌ బైకర్‌ అగస్త్య చౌహాన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ వీడియో చిత్రీకరణ కోసం గంటకు 300 కి.మీ.ల వేగంతో బైక్‌ నడుపుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణానికి గురయ్యాడు.

Updated : 04 May 2023 10:03 IST

అలీగఢ్‌ (యూపీ): ప్రొఫెషనల్‌ బైకర్‌ అగస్త్య చౌహాన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ వీడియో చిత్రీకరణ కోసం గంటకు 300 కి.మీ.ల వేగంతో బైక్‌ నడుపుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణానికి గురయ్యాడు. దిల్లీలో జరిగే మోటార్‌బైక్‌ రేసింగులో పాల్గొనేందుకు బుధవారం ద్విచక్రవాహనంపై ఆగ్రా నుంచి ఇతను బయలుదేరాడు. యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై యూపీలోని టప్పల్‌ పోలీస్‌స్టేషను పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్‌ఎక్స్‌10ఆర్‌ నింజా సూపర్‌బైక్‌పై అగస్త్య మొదటిసారిగా ఈ సాహసం చేశాడు. ఒక దశలో వేగాన్ని నియంత్రించలేకపోవడంతో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తలకు ధరించిన హెల్మెట్‌ ముక్కలు కాగా.. అగస్త్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని