Murder: దారుణం.. ప్రేమికులను చంపేసి చెట్టుకు వేలాడదీశారు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులను హత్య చేసి, వారు ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు.

Published : 12 May 2023 09:36 IST

అమ్మాయి కుటుంబ సభ్యుల ఘాతుకం

ఉన్నావ్‌(యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులను హత్య చేసి, వారు ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్ర కులానికి చెందిన 17 ఏళ్ల బాలిక, దళితుడైన 19 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం నచ్చని అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడిని అపహరించి ఓ మామిడి తోటలో చంపేశారు. ఆ తర్వాత బాలికనూ అక్కడకు తీసుకొచ్చి హతమార్చారు. అనంతరం వారి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. మంగళవారం వారి మృతదేహాలు కనిపించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలిక తండ్రి సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. గురువారం నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని