భర్తను మంచానికి కట్టేసి.. భార్య, కుమార్తెపై అఘాయిత్యం

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఓ మెకానిక్‌ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. అతణ్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్‌ అయిన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారు.

Updated : 23 May 2023 06:59 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఓ మెకానిక్‌ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. అతణ్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్‌ అయిన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారు. రామ్‌పుర్‌ జిల్లా సైఫాని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి గురైన మహిళను, ఆమె కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులతో మెకానిక్‌ గొడవ పడ్డాడనే విషయం తమకు తెలిసిందని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని