Gang rape: విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌.. కాలిన గాయాలతో మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌లో.. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు కాలిన గాయాలతో రెండు నెలలపాటు చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచింది.

Published : 01 Jun 2023 07:08 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌లో.. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు కాలిన గాయాలతో రెండు నెలలపాటు చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచింది. ఈ ఏడాది జనవరి 30న జైసింగ్‌పుర్‌కు చెందిన ఓ విద్యార్థినిని బహ్రీ గ్రామ యువకుడు మహావీర్‌.. తన సన్నిహితుల సాయంతో కిడ్నాప్‌ చేశాడు. అనంతరం ఆమెను గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకువెళ్లారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మహావీర్‌ బృందంపై కేసు నమోదు చేశారు. మార్చి 28న మహావీర్‌, అతడి స్నేహితులు విద్యార్థినిపై అత్యాచారం చేశారు. బాధితురాలు ఎదురుతిరగడంతో ఆమె ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ విషయాన్ని నిందితుడు మహావీర్‌ స్వయంగా బాధితురాలి తండ్రికి ఫోనులో తెలియజేశాడు. మార్చి 29న బాధితురాలి తండ్రి.. సుల్తాన్‌పుర్‌ ఎస్పీ సోమన్‌వర్మను కలిసి మొత్తం వివరించాడు. ఎస్పీ ఆదేశాల మేరకు సూరత్‌కు వెళ్లిన పోలీసుల బృందం బాధితురాలిని లఖ్‌నవూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా గాలించి.. మహావీర్‌, ధనిరామ్‌లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 60 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలు మంగళవారం రాత్రి మరణించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని