ప్రియుడి మోజులో భర్తను చంపి.. ఐదు ముక్కలుగా నరికింది

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను అడ్డుతొలగించుకొనేందుకు గొడ్డలితో నరికి చంపింది.

Updated : 29 Jul 2023 06:54 IST

కుమారుడి ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను అడ్డుతొలగించుకొనేందుకు గొడ్డలితో నరికి చంపింది. అనంతరం మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి గోనె సంచిలో మూటకట్టి కాలువలోకి విసిరేసింది. తన తండ్రి కనిపించకపోవడంపై మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాంపాల్‌ (55) భార్య దులారో దేవికి వేరే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. సోమవారం అర్ధరాత్రి రాంపాల్‌ నిద్రిస్తుండగా గొడ్డలితో నరికి చంపింది. మంగళవారం నుంచి తన తండ్రి కనిపించకపోవడంతో మృతుడి కుమారుడు సోంపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు దులారో దేవిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె తన నేరాన్ని అంగీకరించింది. రాంపాల్‌ మృతదేహాన్ని కాలువలో నుంచి గురువారం వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని