నీళ్లు అడిగిన దివ్యాంగుణ్ని చావబాదిన జవాన్లు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియాలో సచిన్‌సింగ్‌ (26) అనే దివ్యాంగుణ్ని ప్రాంతీయ రక్షక్‌దళ్‌ జవాన్లు ఇద్దరు చావబాదారు.

Updated : 31 Jul 2023 07:06 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియాలో సచిన్‌సింగ్‌ (26) అనే దివ్యాంగుణ్ని ప్రాంతీయ రక్షక్‌దళ్‌ జవాన్లు ఇద్దరు చావబాదారు. సమీపంలోని భవనం పైనుంచి ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. సచిన్‌ 2016లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. సిమ్‌కార్డులు విక్రయిస్తూ, స్థానిక రెస్టారెంటులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి త్రిచక్రవాహనంపై ఇంటికి బయలుదేరిన సచిన్‌కు గుడికి సమీపంలో ఓ తాబేలు కనిపించింది. కిందకి దిగి, దాన్ని ఆలయ కొలనులో వదిలి తిరిగి వచ్చాడు. అక్కడ ప్రాంతీయ రక్షక్‌దళ్‌ జవాన్లు ఇద్దరు కనిపించేసరికి నీళ్లు అడిగాడు. అంతే.. దుర్భాషలాడుతూ సచిన్‌ను వారిద్దరూ చావగొట్టారు. ఆ జవాన్లను రాజేంద్రమణి, అభిషేక్‌సింగ్‌గా గుర్తించి.. ఇద్దరినీ పూర్తిగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎస్పీ సంకల్ప్‌శర్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని