Hyderabad: క్రీడాకారిణికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు!

ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణిని రాష్ట్ర క్రీడా మంత్రి పేషీలోని ఓ పొరుగు సేవల ఉద్యోగి వేధింపులకు గురిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Updated : 15 Aug 2023 12:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణిని రాష్ట్ర క్రీడా మంత్రి పేషీలోని ఓ పొరుగు సేవల ఉద్యోగి వేధింపులకు గురిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జాతీయ స్థాయి క్రీడాకారిణి అయినప్పటికీ ప్రోత్సాహం లభించడం లేదని తన సమీప బంధువు సాయంతో ఆమె క్రీడా మంత్రిని కలిసి సాయం చేయాలని విన్నవించింది. దీంతో వివరాలను తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి ఇచ్చి వెళ్లాలని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్‌ నంబరు తీసుకున్న ఆ ఉద్యోగి... అసభ్యకరమైన సందేశాలను పంపించాడు. వ్యక్తిగత ఫొటోలను పంపించాలని అడిగాడు. ఈ విషయంపై అతడిని క్రీడాకారిణి బంధువు నిలదీయడంతో మొదట అలాంటిదేమీ లేదని బుకాయించాడు. చివరకు తప్పు చేశానని, క్షమించాలని కోరాడు. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో అతడిని కార్యాలయానికి రావొద్దని ఆదేశించినట్లు తెలిసింది. రెండు వారాల నుంచి ఆ ఉద్యోగి విధులకు రావడం లేదని, అతనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు