Magic Mirror: ‘మాయా అద్దం’లో వారిని నగ్నంగా చూడొచ్చని ఆశపడ్డాడు.. చివరికి జరిగిందిదీ!

‘మాయా అద్దం’తో మనుషులను నగ్నంగా చూడొచ్చంటూ ముగ్గురు దుండగులు 72 ఏళ్ల వృద్ధుణ్ని మోసం చేశారు.

Published : 19 Aug 2023 07:25 IST

‘మాయా అద్దం’తో మనుషులను నగ్నంగా చూడొచ్చంటూ ముగ్గురు దుండగులు 72 ఏళ్ల వృద్ధుణ్ని మోసం చేశారు. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అవినాశ్‌ కుమార్‌ (72) వద్దకు పార్థ సింగ్రే, మొలయా సర్కార్‌, సుదీప్తా సిన్హారాయ్‌లు వెళ్లారు. తాము పురాతన వస్తువులను సేకరించే ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నారు. తమ వద్ద ఓ ‘మ్యాజిక్‌ మిర్రర్‌’ (మాయా అద్దం) ఉందని.. దానితో మనుషులను నగ్నంగా చూడొచ్చని, భవిష్యత్తును కూడా అంచనా వేయవచ్చని మాయమాటలు చెప్పారు. రూ.2 కోట్ల విలువైన మాయా అద్దాన్ని కేవలం రూ.9 లక్షలకే విక్రయిస్తామని ఆశ చూపారు. అవినాశ్‌ కుమార్‌ తొలుత ఈ విషయమై సందేహం వ్యక్తం చేశాడు. దీంతో నిందితులు.. అమెరికా నాసా శాస్త్రవేత్తలు సహా అనేక మంది ఉపయోగించారంటూ నమ్మకం కలిగించారు. అనంతరం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్లిన అవినాశ్‌ కుమార్‌ అక్కడ రూ.9 లక్షలు చెల్లించి.. ఆ మ్యాజిక్‌ మిర్రర్‌ను కొన్నాడు. చివరకు అదంతా మోసమని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. పశ్చిమబెంగాల్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని