Kakinada: తరగతి గదిలో తేలు కాటు.. రక్తపు వాంతులతో విద్యార్థి మృతి!

తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతిచెందిన ఘటన డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గురువారం జరిగింది.

Updated : 25 Aug 2023 08:57 IST

ఉపాధి నిమిత్తం తండ్రి వరంగల్‌లో.. తల్లి కువైట్‌లో

కాకినాడ, కపిలేశ్వరపురం - న్యూస్‌టుడే: తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతిచెందిన ఘటన డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన వై.ప్రసాద్‌, శ్రీదేవిల చిన్నకుమారుడైన అభిలాష్‌ (14).. వాకతిప్ప జడ్పీహెచ్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో చిక్కీల రేపర్లు ఎక్కువగా ఉండటంతో మరో విద్యార్థితో కలిసి వాటిని ఏరుతుండగా అభిలాష్‌ ఎడమ చేతిని తేలు కుట్టింది. ఉపాధ్యాయులు విద్యార్థిని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఊపిరితిత్తుల్లోకి విషం చేరడంతో, రక్తపు వాంతులు అయ్యి బాలుడు మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి వలస కూలీగా వరంగల్‌లో పనిచేస్తుండగా, తల్లి ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నారు. తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఇలా జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని