Swap Party: చెన్నై శివారులో స్వాప్‌ పార్టీ

చెన్నై సమీపం ఈసీఆర్‌ రోడ్డులోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన స్వాప్‌ పార్టీలో పాల్గొన్న 8 మంది మహిళలు, 15 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 08 Nov 2023 07:54 IST

8 మంది మహిళలు, 15 మంది పురుషుల అరెస్టు

చెన్నై (మహాబలిపురం), న్యూస్‌టుడే: చెన్నై సమీపం ఈసీఆర్‌ రోడ్డులోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన స్వాప్‌ పార్టీలో(Swap Party) పాల్గొన్న 8 మంది మహిళలు, 15 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నై ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డుపై పనైయూర్‌ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌ను పార్టీ కోసం ఈ నెల 4, 5 తేదీల్లో కొందరు బుక్‌ చేసుకున్నారు. శనివారం అక్కడికి కొందరు మహిళలు, పురుషులు చేరుకున్నారు. అనంతరం భారీ శబ్దంతో పాటలు పెట్టుకుని గంజాయి, మద్యం తదితర మత్తుపదార్థాలు తాగిన మత్తులో మహిళలను మార్చుకుని (స్వాప్‌) ఉల్లాసంగా గడిపారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఫాంహౌస్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టి, 8 మంది మహిళలు, 15 మంది పురుషులను అరెస్టు చేశారు. వారిని విచారించగా కోవై జిల్లా మేట్టుపాళ్యానికి చెందిన సెంథిల్‌కుమార్‌ (45), అతడి భార్య 2018 నుంచి.. ఆర్థికంగా చితికిపోయి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మహిళలకు సామాజిక మాధ్యమం ద్వారా గాలం వేసి స్వాప్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని