గ్లాస్‌ డోర్‌ మీదపడి చిన్నారి మృతి

పంజాబ్‌లోని లుధియానా షోరూంలో గ్లాస్‌ డోర్‌తో ఆడుకొంటున్న మూడేళ్ల చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. నగరంలోని ఘుమార్‌ మండీ వస్త్రదుకాణంలో ఈ దుర్ఘటన జరిగింది.

Published : 29 Nov 2023 04:07 IST

లుధియానా: పంజాబ్‌లోని లుధియానా షోరూంలో గ్లాస్‌ డోర్‌తో ఆడుకొంటున్న మూడేళ్ల చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. నగరంలోని ఘుమార్‌ మండీ వస్త్రదుకాణంలో ఈ దుర్ఘటన జరిగింది. వస్త్ర కొనుగోలు కోసం వచ్చిన తల్లిదండ్రులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. దుకాణ ప్రవేశం వద్ద ఉన్న గ్లాస్‌ డోర్‌ పిడిని చేత్తో పట్టుకొని దివరీన్‌ కౌర్‌ (3) ఆడుకొంటున్న తరుణంలో ప్రమాదం జరిగింది. బోల్టులు వదులుగా ఉన్న తలుపు ఊడి అమాంతం చిన్నారిపై పడింది. పాప కేకలు విని పరుగున అక్కడకు చేరుకున్న అందరూ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని