కోటాలో నీట్‌ అభ్యర్థి ఆత్మహత్య

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం మరో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 29 Nov 2023 04:08 IST

ఈ ఏడాదిలో 28కి చేరిన విద్యార్థుల బలవన్మరణాలు

కోటా: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం మరో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 28కి చేరింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన హుస్సేన్‌ అనే విద్యార్థి నీట్‌కు సిద్ధమవుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భోజనం చేసి వసతి గృహంలోని తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గది నుంచి ఎంతకీ బయటకు రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. గది తలుపులు తెరిచారు. అక్కడ ఉరి వేసుకుని కనిపించిన ఆ విద్యార్థిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే, అతని గదిలో ఎలాంటి ఆత్మహత్య లేఖను పోలీసులు గుర్తించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని