నకిలీ ధ్రువపత్రాలిస్తే క్రిమినల్‌ చర్యలు

పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని శాఖ సంచాలకుడు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Updated : 30 Nov 2023 04:21 IST

ఈనాడు, కర్నూలు: పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని శాఖ సంచాలకుడు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. ‘ఈనాడు’ శనివారం ప్రధాన సంచికలో ‘అంగట్లో బోగస్‌ సర్టిఫికెట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ధ్రువపత్రాల వాస్తవికత నిర్ధారించుకున్న తర్వాతే నియామకాలు చేపడతామన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిల్లో పత్రాల పరిశీలన కోసం ప్రత్యేకంగా కమిటీలు వేస్తున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని