మత్తులో నెలల బిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ తండ్రి కన్నకూతుర్ని నేలకేసి కొట్టి చంపాడు. వివరాలలోకి వెళితే.. సీతాపుర్‌కు చెందిన మమత, దర్నాగ్‌ వాసి సౌరబ్‌ గౌతంలకు ఏడాది క్రితం ప్రేమపెళ్లి జరిగింది.

Updated : 30 Nov 2023 06:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ తండ్రి కన్నకూతుర్ని నేలకేసి కొట్టి చంపాడు. వివరాలలోకి వెళితే.. సీతాపుర్‌కు చెందిన మమత, దర్నాగ్‌ వాసి సౌరబ్‌ గౌతంలకు ఏడాది క్రితం ప్రేమపెళ్లి జరిగింది. స్థానికంగా ఉన్న ఓ అతిథిగృహంలో సౌరబ్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని మత్తులో జోగుతూ సౌరబ్‌ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది. మమతపై దాడి చేసిన సౌరబ్‌.. ఆమె చేతిని విరగ్గొట్టాడు. అంతటితో ఆగకుండా మంచంపై నిద్రిస్తున్న మూడు నెలల కుమార్తెను ఎత్తుకొని నేలకు కొట్టాడు. మత్తులో ఉన్న అతడు ఆ చిన్నారి చనిపోయేంతవరకు కొడుతూనే ఉన్నాడు. భార్య ఫిర్యాదుతో నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని