యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లా బహదుర్‌పుర్‌ గ్రామంలో దారుణహత్య జరిగింది. ఓ యువకుడిని హతమార్చిన  తండ్రీకుమారులు అతడి శరీర భాగాలను 400 ముక్కలుగా చేశారు.

Published : 30 Nov 2023 05:18 IST

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లా బహదుర్‌పుర్‌ గ్రామంలో దారుణహత్య జరిగింది. ఓ యువకుడిని హతమార్చిన  తండ్రీకుమారులు అతడి శరీర భాగాలను 400 ముక్కలుగా చేశారు. అనంతరం వాటిని వివిధ ప్రాంతాల్లో విసిరేశారు. దిల్లీ  కాల్‌సెంటర్‌ ఉద్యోగిని శ్రద్ధావాకర్‌ హత్య తరహాలో రెండు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహదుర్‌పుర్‌ వాసి రాజుఖాన్‌కు అదే ప్రాంతానికి చెందిన తండ్రీకుమారులు కల్లుఖాన్‌, నజీంఖాన్‌లతో గొడవ జరిగి కేసు నమోదైంది. రాజుఖాన్‌ను రాజీ చేసుకోవాలని కోరగా.. అతడు రూ.20 వేలు డిమాండ్‌ చేశాడు. ఆ డబ్బు ఇచ్చే మిషతో రాజును ఇంటికి పిలిచిన తండ్రీకుమారులు డంబెల్‌తో తలపై కొట్టి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి 15 సంచుల్లో పెట్టి వివిధ ప్రాంతాల్లో పడేశారు. గ్వాలియర్‌లోని జనక్‌గంజ్‌ ఠాణా పరిధి మురుగుకాలువలో సెప్టెంబరు 28న యువకుడి మొండెం దొరకడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలిసి కల్లుఖాన్‌, నజీంఖాన్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల అనుమానం మరింత బలపడి తండ్రీకుమారులను ఇటీవల అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని