ప్రియుడి సూచనతో.. లేడీస్‌ హాస్టల్‌ టాయిలెట్లో రహస్య కెమెరా!

చండీగఢ్‌లో ఓ యువతి తన ప్రియుడి కోరిక మేరకు లేడీస్‌ హాస్టలు (పీజీ) మరుగుదొడ్లో వెబ్‌కెమెరాను అమర్చి పోలీసులకు చిక్కింది.

Updated : 01 Dec 2023 06:45 IST

చండీగఢ్‌లో ఓ యువతి తన ప్రియుడి కోరిక మేరకు లేడీస్‌ హాస్టలు (పీజీ) మరుగుదొడ్లో వెబ్‌కెమెరాను అమర్చి పోలీసులకు చిక్కింది. రహస్య కెమెరా ద్వారా పీజీలోని యువతుల వీడియోలను ఎవరి కంటా పడకుండా చిత్రీకరించేవారు. కెమెరాను ఇటీవల ఓ అమ్మాయి గుర్తించి పీజీ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వెబ్‌కెమెరాను అమర్చిన యువతితోపాటు ఆమె ప్రియుణ్ని అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకొన్న కెమెరా, మొబైల్‌ ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు