ఛత్తీస్‌గఢ్‌లో ఉపసర్పంచి హత్య

ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 23వ వారోత్సవాల వేళ విధ్వంసానికి పాల్పడటంతోపాటు ఓ ఉపసర్పంచిని హత్య చేశారు.

Published : 02 Dec 2023 02:51 IST

మావోయిస్టుల దుశ్చర్య

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 23వ వారోత్సవాల వేళ విధ్వంసానికి పాల్పడటంతోపాటు ఓ ఉపసర్పంచిని హత్య చేశారు. రెండు రోజుల క్రితం ఛోటే బేతియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కదండి పంచాయతీ ఉపసర్పంచి రాము కచలామీ(45) తన ఇంటి వద్ద నిద్రిస్తుండగా మావోయిస్టులు అపహరించారు. శుక్రవారం ఆదివాసీల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించారు. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నారని, మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం నరికి హత్య చేసి గ్రామ శివారులో మృతదేహాన్ని వదిలేశారు. ఛోటే బేతియా గ్రామ శివారులో సెల్‌ టవర్‌కు నిప్పంటించడంతోపాటు రహదారిని అనేక చోట్ల తవ్వేశారు. డిసెంబరు 2 నుంచి 8 వరకు గ్రామగ్రామాన పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహించాలని బ్యానర్లు కట్టి, కరపత్రాలు పంచారు.

నలుగురి అరెస్టు

దంతెవాడ జిల్లాలో భాన్సీ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గాహనార్‌-భేచాపాల్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు శుక్రవారం నలుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని