తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ

మణిపుర్‌లో 10 మంది దుండగులు ఓ బ్యాంకులోకి తుపాకులతో చొరబడి రూ.18.80 కోట్లు దోచుకున్నారు. ఉఖ్‌రుల్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 02 Dec 2023 04:02 IST

మణిపుర్‌లో ఘటన

ఇంఫాల్‌: మణిపుర్‌లో 10 మంది దుండగులు ఓ బ్యాంకులోకి తుపాకులతో చొరబడి రూ.18.80 కోట్లు దోచుకున్నారు. ఉఖ్‌రుల్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం సుమారు 5.40 గంటల సమయంలో సాయుధులు ముఖాలకు ముసుగులు ధరించి సిబ్బంది రాకపోకలు సాగించే ద్వారం గుండా బ్యాంకులోకి చొరబడ్డారు. ఉద్యోగులతోపాటు భద్రత సిబ్బందిని తుపాకులతో బెదిరించి మరుగుదొడ్డిలో బంధించారు. అనంతరం ఓ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టి బలవంతంగా లాకర్‌ను తెరిపించి, నగదును దోచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉఖ్‌రుల్‌ జిల్లాలోని బ్యాంకులు, ఏటీఎంలకు తరలించడానికి అవసరమైన నగదును ఆర్బీఐ ఈ శాఖలోనే నిల్వ చేస్తుందని అధికారులు తెలిపారు. బ్యాంకులోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని