భద్రాద్రి జిల్లాలో 40 కిలోల ల్యాండ్‌మైన్‌ వెలికితీత

పోలింగ్‌ విధులకు హాజరైన భద్రతా బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రను భగ్నం చేసినట్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్‌ వెల్లడించారు.

Published : 02 Dec 2023 02:56 IST

మావోయిస్టుల కుట్ర భగ్నం

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలింగ్‌ విధులకు హాజరైన భద్రతా బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రను భగ్నం చేసినట్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలం పెద్ద మిడిసిలేరు అటవీ ప్రాంతంలోని రహదారిలో సుమారు 40 కిలోల పేలుడు పదార్థాన్ని మావోయిస్టులు పాతిపెట్టారు. మందుపాతరను బాంబు స్క్వాడ్‌ దళం ముందే గుర్తించి పేల్చివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో అయిదడుగులకు పైగా లోతైన గుంత ఏర్పడింది. నిషేధిత మావోయిస్టు పార్టీ ఎన్నికలకు అడ్డంకులు సృష్టించడం ద్వారా ఉనికిని చాటుకోవాలని చూసిందని ఎస్పీ వినీత్‌ అన్నారు. వారి చర్యలను పోలీసు బలగాలు సమర్థంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. పోలీసులపై నమ్మకంతో పోలింగ్‌లో పాల్గొన్న నక్సల్స్‌ ప్రభావిత ప్రాంత ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని