లోయలో పడిన వాహనం.. ఆరుగురి దుర్మరణం

ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందిన దుర్ఘటన శిమ్లా జిల్లాలోని సున్నీ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 05 Dec 2023 04:02 IST

శిమ్లా: ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందిన దుర్ఘటన శిమ్లా జిల్లాలోని సున్నీ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కరార్‌ఘాట్‌ వద్ద మండికి వెళుతున్న వాహనం నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మరణించిన కూలీలు జమ్మూ-కశ్మీర్‌కు చెందినవారుగా గుర్తించారు. ముగ్గురు ప్రమాదస్థలంలోనే చనిపోగా.. మిగతావారు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని