శ్రీ రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ దారుణ హత్య

శ్రీ రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు.

Published : 06 Dec 2023 05:29 IST

ఇంట్లోనే దుండగుల కాల్పులు

జైపుర్‌: శ్రీ రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లోని శ్యామ్‌నగర్‌లో తన నివాసంలో ఉండగా దుండగులు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సుఖ్‌దేవ్‌ నివాసానికి వెళ్లారు. గోగామేడీతో మాట్లాడాల్సి ఉందని భద్రతా సిబ్బందికి చెప్పారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని లోపలకు తీసుకెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఉన్నట్టుండి కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ముగ్గురు దుండగుల్లో ఒకడైన నవీన్‌ షెకావత్‌ సహచరుల కాల్పుల్లో మరణించాడు. గోగామేడీ భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతోనే నవీన్‌ మరణించాడని జైపుర్‌ పోలీస్‌ కమిషనర్‌ బిజు జార్జ్‌ జోసెఫ్‌ తొలుత వెల్లడించారు. సుఖ్‌దేవ్‌ హత్యకు తమదే బాధ్యత అంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు అనుబంధంగా పనిచేసే రోహిత్‌ గోదారా గ్యాంగ్‌ ప్రకటించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని