అపహరించి.. డబ్బులు డిమాండ్‌ చేసి

డబ్బుల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన కేసును అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు.

Published : 07 Dec 2023 04:37 IST

వాలంటీరుతో కలిసి ఆశా కార్యకర్త పన్నాగం
కేసును ఛేదించిన రైల్వేకోడూరు పోలీసులు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: డబ్బుల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన కేసును అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం ఇసుకపల్లెకు చెందిన లక్కిం వెంకటేష్‌ ఇటీవల రైల్వేకోడూరు పరిధిలోని జంగిటివారిపల్లెకు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఈ నెల 2న భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లారు. 3వ తేదీ ఆయన అదృశ్యమయ్యారు. వెంకటేష్‌ మామ శివశంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకటేష్‌కు వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురానికి చెందిన ఆశా కార్యకర్తతో రాంగ్‌ కాల్‌ ద్వారా పరిచయమేర్పడడంతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవారు. ఈ నెల 3న వెంకటేష్‌ను కడపకు రప్పించిన ఆ మహిళ కమలాపురానికి చెందిన వాలంటీర్‌ నవీన్‌, అతని స్నేహితుడు ప్రతాప్‌లతో కలిసి కిడ్నాప్‌ చేయించింది. అనంతరం డబ్బులు ఇస్తే వదిలేస్తామని బెదిరించారు. పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని రిమాండుకు తరలించి, బాధితుణ్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని