మహదేవ్‌ యాప్‌ నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో కీలక నిందితుడు అసిమ్‌దాస్‌ తండ్రి సుశీల్‌దాస్‌(62) అనుమానాస్పద స్థితిలో మరణించారు.

Published : 07 Dec 2023 05:09 IST

దుర్గ్‌(ఛత్తీస్‌గఢ్‌): ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో కీలక నిందితుడు అసిమ్‌దాస్‌ తండ్రి సుశీల్‌దాస్‌(62) అనుమానాస్పద స్థితిలో మరణించారు. దుర్గ్‌ జిల్లా అచ్చోటి గ్రామ శివారులోని ఓ బావిలో మంగళవారం అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుశీల్‌ ఆదివారం సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతుడు ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుండేవారు. ఆయన కుమారుడు అసిమ్‌ దాస్‌(కొరియర్‌)తోపాటు కానిస్టేబుల్‌ భీమ్‌సింగ్‌ను మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో నవంబర్‌ 3న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అసిమ్‌దాస్‌ నుంచి రూ.5.39 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు రూ.508 కోట్లు ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో అరెస్టయిన కొరియర్‌ తొలుత తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొంది. అయితే, తర్వాత అసిమ్‌ దాస్‌ మాట మార్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని