అత్తమామల చేతిలో శివాని బలి.. చితిలో కాలిన శవంతో ఠాణాకు!

చితిలో కాలిపోతున్న కుమార్తె మృతదేహాన్ని బయటకు తీసిన తల్లిదండ్రులు.. దాన్ని అలాగే తీసుకొని పోలీస్‌స్టేషనుకు వెళ్లారు.

Published : 07 Dec 2023 05:15 IST

చితిలో కాలిపోతున్న కుమార్తె మృతదేహాన్ని బయటకు తీసిన తల్లిదండ్రులు.. దాన్ని అలాగే తీసుకొని పోలీస్‌స్టేషనుకు వెళ్లారు. తమ కుమార్తెను ఆమె అత్తమామలే చంపారని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకే దహన సంస్కారాల గురించి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ మృతదేహాన్ని పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ దారుణం జరిగింది. అలీగఢ్‌లోని ఖైర్‌ పోలీస్‌స్టేషను పరిధికి చెందిన శివాని అనే యువతికి లోకేశ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచీ అదనపు కట్నం, కారు కోసం కోడల్ని అత్తమామలు వేధించేవారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా శివాని మృతి.. హడావుడి అంత్యక్రియల ఏర్పాట్లు జరిగాయి. కుమార్తె మరణవార్త విని శ్మశానానికి చేరుకున్న శివాని తల్లిదండ్రులు.. అప్పటికే చితిలో కాలుతున్న మృతదేహాన్ని స్థానికుల సాయంతో బయటకుతీసి పోలీసులను ఆశ్రయించారు. పరారీలో ఉన్న శివాని అత్తమామలను అదుపులోకి తీసుకొన్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని