13 వేల బాతు పిల్లల మృత్యువాత.. నష్టాన్ని తట్టుకోలేక..

మిగ్‌జాం తుపాను కారణంగా రూ.15 లక్షల విలువ చేసే బాతు పిల్లలు మృతి చెందగా.. నష్టాన్ని తట్టుకోలేక వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందడం విషాదం నింపింది.

Updated : 07 Dec 2023 06:26 IST

సత్తుపల్లి, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను కారణంగా రూ.15 లక్షల విలువ చేసే బాతు పిల్లలు మృతి చెందగా.. నష్టాన్ని తట్టుకోలేక వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందడం విషాదం నింపింది. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పెరం ఏడుకొండలు భార్య రమాదేవి, కుమారుడు నాగార్జున, తల్లి ఆదిలక్ష్మి(67)తో కలిసి రెండు నెలల క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురానికి బాతుల పెంపకం కోసం వలస వచ్చారు. సుమారు 15 వేల బాతు పిల్లలను గ్రామ శివార్లలో మేపుతూ జీవిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో రెండు ప్రాంతాల్లో ఉంచిన సుమారు 13 వేల బాతు పిల్లలు చలి, వర్షానికి తట్టుకోలేక మృత్యువాత పడ్డాయి. వాటి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. మృత్యువాత పడిన బాతు పిల్లలను చూసి.. జరిగిన నష్టాన్ని తట్టుకోలేక ఆదిలక్ష్మి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిందని వారు పేర్కొన్నారు. పశుసంవర్ధకశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని