చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి దాడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపుర్‌లో దారుణం చోటుచేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ యువకుణ్ని కొందరు వ్యక్తులు చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి విచక్షణారహితంగా చితకబాదారు.

Published : 08 Dec 2023 05:29 IST

ఫోన్‌ చోరీ చేశాడన్న అనుమానంతో యువకుడిపై దాష్టీకం

మిర్జాపుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపుర్‌లో దారుణం చోటుచేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ యువకుణ్ని కొందరు వ్యక్తులు చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి విచక్షణారహితంగా చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3న తన కుమారుడు జైశంకర్‌ బహేలియా(25)ను నలుగురు వ్యక్తులు ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని