Heart Attack: గుండె పట్టుకుని ఆసుపత్రికి బస్సు నడిపి.. నిమిషాల వ్యవధిలోనే..

బస్సు నడుపుతున్న డ్రైవరు హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. నొప్పిని పంటి బిగువన పట్టి దగ్గరలోని ఆసుపత్రి వరకు వాహనాన్ని నడిపారు.

Updated : 16 Feb 2024 06:20 IST

చికిత్స పొందుతూ మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్‌

కల్లూరు, న్యూస్‌టుడే: బస్సు నడుపుతున్న డ్రైవరు హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. నొప్పిని పంటి బిగువన పట్టి దగ్గరలోని ఆసుపత్రి వరకు వాహనాన్ని నడిపారు. కానీ వైద్యుల వద్దకు వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. జిల్లాలోని వేంసూరు మండలం రామన్నపాలెంకు చెందిన కాకాని శ్రీనివాసరావు(45) సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెల్లవారుజామున సత్తుపల్లి నుంచి ఖమ్మం బయలుదేరారు. ఉదయం 6 గంటల సమయంలో కల్లూరు పట్టణం సమీపంలోకి చేరగానే గుండెలో నొప్పిగా ఉందంటూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి బస్సు తీసుకెళ్లారు. ఆయనే నడుచుకుంటూ లోనికి వెళ్లారు. కానీ వైద్యులు పరీక్షిస్తుండగానే పరిస్థితి విషమించి మృతిచెందారు. ఈ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని