వైకాపా కార్యకర్త దాష్టీకం.. రూ. 3,000 వడ్డీ బకాయి కోసం కత్తితో దాడి

వైకాపా నాయకుల ఆగడాలు నానాటికి మితిమీరుతున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రద్దీగా ఉండే ఉదయగిరి వంతెన కూడలి వద్ద గురువారం అందరూ చూస్తుండగానే వైకాపా కార్యకర్త కత్తితో దాడి చేసిన వైనమిది.

Updated : 23 Feb 2024 06:41 IST

రాజీకి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి యత్నం

కావలి, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల ఆగడాలు నానాటికి మితిమీరుతున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రద్దీగా ఉండే ఉదయగిరి వంతెన కూడలి వద్ద గురువారం అందరూ చూస్తుండగానే వైకాపా కార్యకర్త కత్తితో దాడి చేసిన వైనమిది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టీ బంకులో పనిచేసే మేడికొండ మాల్యాద్రి ఇంటి నిర్మాణం కోసం వైకాపా వార్డు నాయకుడు వేముల రాబర్ట్‌ వద్ద రూ. 30,000 అప్పు తీసుకున్నారు. నెలకు రూ. 3,000 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు. ఓ నెల ఆలస్యమైందంటూ రాబర్ట్‌ తన వద్ద పని చేసే శాంతి అనే యువకుడిని మల్యాద్రి వద్దకు పంపించారు. వచ్చే నెలలో చెల్లిస్తానని మాల్యాద్రి చెబుతుండగా శాంతి ఆయనను కొట్టాడు. పైగా తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి దిగాడు. మాల్యాద్రి తప్పుకోవడంతో దవడ కింది భాగంలో గాయమైంది. ఈలోపు నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలియగానే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాధితుడు మాల్యాద్రిని పరామర్శించారు. నిందితుడు వైకాపా సానుభూతిపరుడు కావడంతో.. పోలీసు కేసు లేకుండా రాజీ చేసుకోవాలని సూచించారు. అందుకు ఒప్పుకోని మల్యాద్రి కేసు నమోదు చేయాల్సిందేనని పట్టుబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని